రకుల్..దీపికాల ఫోన్లు సీజ్ చేసిన ఎన్ సీబీ
టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్ల మత్తు దిగుతోందా?. చూస్తుంటే ఎన్ సీబీ ఆ దిశగానే చర్యలు తీసుకుంటున్నట్లు కన్పిస్తోంది. డ్రగ్స్ కు సంబంధించిన అంశాలపై బాలీవుడ్ భామలపై పలు ప్రశ్నలు సంధించిన ఎన్ సీబీ అధికారులు కీలక అడుగు వేశారు. టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తోపాటు బాలీవుడ్ భామలు దీపికా పడుకొణె, సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్, కర్మిష్మా ప్రకాష్, సిమోన్ ఖంబట్టా, జయా షా ఫోన్లను సీజ్ చేశారు. ఎన్ సీబీ అధికారులు తమ ప్రశ్నలకు సమాధానం రాబట్టిన తర్వాత ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ సీబీ అధికారులు వెల్లడించారు. శనివారం హీరోయిన్లు దీపికా పదుకొణె, సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్‌లను సుదీర్ఘంగా వేర్వేరుగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. మరోవైపు కరిష్మా డ్రగ్స్ గురించి జరిపిన వాట్సాప్ చాట్‌లో ‘డి’అనే అక్షరం ఆధారం చాటింగ్ చేసినట్లు 7 గంటల సుదీర్ఘ విచారణలో వెల్లడైంది.
అయితే ఇది ఎవరిని ఉద్దేశించి చేశారు అనేదానిపై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో భాగంగానే మరికొన్ని ఆధారాల కోసం వారి మొబైల్ ఫోన్స్ సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఎన సీబీ విచారణలో దీపికా పడుకొణె పలుమార్లు కన్నీరు పెట్టుకోవటంతో ఎన్ సీబీ అధికారులు చికాకు పడినట్లు చెబుతున్నారు. ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఆమె ప్రతిసారి కన్నీరు పెట్టుకోవటంతో సినిమాల్లో చేసినట్లు ఇక్కడ ఎమోషనల్ వ్యవహారాలు వద్దని వ్యాఖ్యనించినట్లు జాతీయ మీడియా కథనాలు వచ్చాయి,