Telugu Gateway
Cinema

డ్రగ్స్ చాట్ లో నమ్రతా శిరోద్కర్ పేరు!

డ్రగ్స్ చాట్ లో నమ్రతా శిరోద్కర్ పేరు!
X

దేశంలో దుమారం రేపుతున్న డ్రగ్స్ కేసులో టాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు ఇప్పటికే బయటకు వచ్చింది. ఈ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న రియా చక్రవర్తి రకుల్ ప్రీత్ సింగ్ పేరు తెలిపినట్లు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సీబీ) అధికారులు ధృవీకరించారు. త్వరలోనే రకుల్ తోపాటు సారాఅలీఖాన్ తదితరులకు నోటీసులు ఇవ్వనున్నట్లు కూడా తెలిపారు. ఈ తరుణంలో వాట్సప్ చాట్ లో టాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరో మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ పేరు కూడా వెలుగుచూసింది. ఈ విషయాన్ని జాతీయ మీడియా వెల్లడించింది. అయితే ఈ వార్తలను నమ్రతా టీం తోసిపుచ్చుతోంది. డ్రగ్స్ వ్యవహారంలో జాబితా చాంతాడంత పెరుగుతూ పోతోంది. దియా మీర్జా పేరు కూడా తాజాగా వెలుగులోకి రావటంతో ఆమె ఈ వార్తలను ఖండించింది.

దీపికా పడుకొనేతోపాటు పలువురు కీలక నటీమణులు పేర్లు బయటకు వచ్చాయి. వీరికి నోటీసులు ఇఛ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఎన్ సీబీ వెల్లడించింది. హీరోయిన్లకు డ్రగ్స్ సప్లయ్ చేసినట్టుగా విచారణ ఎదుర్కొంటున్న జయసాహా ఎన్ సీబీకి వాంగ్మూలం ఇచ్చారు. ఎన్ సిబి ట్రాకింగ్‌లో జయసాహా, నమ్రత చాటింగ్ కూడా బయటపడినట్లు జాతీయ మీడియా చెబుతోంది. ‘ముంబయ్ లో మంచి ఎండీ ఇస్తావని ప్రామిస్ చేశావ్. ఎండీ ఇచ్చాక మనం కలిసి పార్టీ చేసుకుందాం’అని నమ్రత చాటింగ్ చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. తాజాగా జయ సాహాని ఎన్‌సీబీ విచారిస్తుండగా నమ్రత పేరు బయటికొచ్చినట్టు సమాచారం. కొందరు సినీ ప్రముఖులకు డ్రగ్స్‌ సరఫరా చేసినట్టు సాహా వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం.

Next Story
Share it