మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ అరెస్ట్
BY Telugu Gateway9 Sept 2020 8:21 PM IST
X
Telugu Gateway9 Sept 2020 8:21 PM IST
తెలంగాణలో బుధవారం నాడు సంచలనం సృష్టించిన అవినీతి కేసులో మెదక్ అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అరెస్ట్ అయ్యారు. ఏసీబీ సోదాల అనంతరం బుధవారం సాయంత్రం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నగేష్‌తో పాటు నర్సాపూర్ ఆర్డీవో అరుణా రెడ్డి, చల్పిచేడు తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, సర్వేల్యాండ్ రికార్డ్ జూనియర్ అసిస్టెంట్ వసీం మహ్మద్, నగేష్ బినామీ జీవన్ గౌడ్‌ను ఏసీబీ అదుపులోకి తీసుకుంది.
వీరందరికీ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం హైదరాబాద్ తరలిస్తున్నారు. భూ వివాదం కేసులో లంచం తీసుకుంటూ నగేష్ పట్టుబడిన విషయం తెలిసిందే. ఓ భూమికి సంబంధించి ఎన్ వోసీ జారీ చేసే విషయంలో లంచం డిమాండ్ చేసిన నగేష్ అందులో కొంత మొత్తం అంటే నలభై తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే.
Next Story