సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం పేరుతో నెల్లూరులో సంగీత విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబానాయుడు కోరారు. అంతే కాకుండా ప్రతి ఏటా బాలసుబ్రమణ్యం పుట్టిన రోజును రాష్ట్ర పండుగగా నిర్వహించాలన్నారు. జాతీయ పురస్కారం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు చంద్రబాబునాయుడు ఆదివారం నాడు సీఎం జగన్ కు లేఖ రాశారు. నెల్లూరులో ఏర్పాటు చేసే యూనివర్శిటీలో బాల సుబ్రమణ్యం కాంస్య విగ్రహం ఏర్పాటుతో పాటు ఆ ప్రాంతాన్ని బాల సుబ్రమణ్యం సంగీత కళాక్షేత్రంగా అభివృద్ది చేయాలని కోరారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ పై 33మంది తెలుగు మహనీయుల విగ్రహాలను ప్రతిష్టించడం, తెలుగు విశ్వ విద్యాలయం ఏర్పాటుతో పాటు, లలిత కళా తోరణం అభివృద్ది తెలిసిందేనన్నారు. అదే స్ఫూర్తితో నెల్లూరులో ఎస్ పి బాలసుబ్రమణ్యం సంగీత విశ్వవిద్యాలయం ఏర్పాటు, కళాక్షేత్రం అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం నడుం కట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని పేర్కొన్నారు.