Telugu Gateway
Cinema

నటి సంజన అరెస్ట్

నటి సంజన అరెస్ట్
X

కన్నడ సినీ పరిశ్రమను ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోంది. వరస పెట్టి అరెస్ట్ లు జరుగుతున్నాయి. మంగళవారం నాడు టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన కన్నడ నటి సంజనను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నటి సంజన ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు ఆ తర్వాత అమెను అరెస్ట్ చేశారు. నటి సంజన సన్నిహితుడు, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి రాహుల్‌ ఇప్పటికే అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అతడి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కాల్‌ డేటాను సేకరించే పనిలో ఉన్నారు.

మొబైల్‌లోని పలు ఫోటోలు, వీడియోల ఆధారంగా పలువురికి నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో సంజన పేరు బయటకు రావడంతో రాగిణితో తనకు సంబంధం లేదని, ఇద్దరూ ఒక సినిమాలో మాత్రం కలిసి నటిస్తున్నట్లు ఆమె తెలిపారు. సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసుల (సీసీబీ) హీరోయిన్‌ రాగిణి ద్వివేది ఇంటిపై శుక్రవారం తెల్లవారుజామున దాడి చేసి ఆమెను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Next Story
Share it