Telugu Gateway
Cinema

జయాబచ్చన్ పై కంగనా సంచలన వ్యాఖ్యలు

జయాబచ్చన్ పై కంగనా సంచలన వ్యాఖ్యలు
X

బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం పార్లమెంట్ ను కూడా తాకింది. బిజెపి ఎంపీ రవికిషన్ ఈ అంశంపై లోక్ సభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యువత డ్రగ్స్ కారణంగా పెడదారి పడుతోందని..బాలీవుడ్ లో డ్రగ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని..దేశంలోకి చైనా, పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ వస్తున్నాయని రవికిషన్ తెలిపారు. ఈ అంశంపై రాజ్యసభలో సమాజ్ వాది పార్టీ ఎంపీ జయాబచ్చన్ మాట్లాడుతూ రవికిషన్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. డ్రగ్స్ పేరుతో సినిమా ఇండస్ట్రీకి చెడ్డ పేరు తెచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా సినీ నటులను వేధిస్తున్నారని... సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారు కూడా బాలీవుడ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ వ్యవహారంపై ఫైర్ బ్రాండ్ నటి కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘మీ కుమారుడు అభిషేక్‌ బచ్చక్‌ కూడా సుశాంత్‌లా ఆత్మహత్యకు పాల్పడితే ఇలానే మాట్లాడుతారా అంటూ ప్రశ్నించారు. ’రాజ్యసభలో జయాబచ్చన్‌ మాట్లాడిన తీరు సరైనది కాదు. నాకు మాదిరిగా మీ కుమార్తె స్వేతా బచ్చన్‌ కుడా టీనేజ్‌లో వేధింపులు గురైతే ఇలానే స్పందిస్తారా. కొందరు వ్యక్తుల మూలంగా మానసిక ఒత్తిడి గురై సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌లా మీ కుమారుడు అభిషేక్‌ కూడా ఆత్మహత్యకు పాల్పడితే ఇలానే మాట్లాడుతారా. మాపైన కాస్త జాలి చూపండి’ అని మండిపడ్డారు.

Next Story
Share it