Telugu Gateway
Politics

పబ్జీ తో సహా మరో 118 చైనా యాప్ లపై వేటు

పబ్జీ  తో సహా మరో 118 చైనా యాప్ లపై వేటు
X

భారత్, చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల తరుణంలో భారత సర్కారు చైనా కంపెనీలపై వరస పెట్టి కొరడాలు ఝుళిపిస్తోంది. అత్యంత కీలకమైన కంపెనీలకు షాక్ ల మీద షాక్ లు ఇస్తోంది. ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందిన టిక్ టాక్ తోపాటు చైనాకు చెందిన పలు యాఫ్ లపై వేటు వేసిన భారత సర్కారు బుధవారం నాడు కొత్తగా మరో 118 యాప్ లపై నిషేధం విధించింది.. ఇందులో ఎంతో పాపులర్, ప్రమాదకరమైన పబ్జీ ఆన్ లైన్ గేమింగ్ యాప్ కూడా ఉంది. భారత సర్కారు తీసుకున్న యాప్ ల పై వేటు నిర్ణయంపై చైనా తన అసంతృప్తిని వెళ్ళగక్కుతోంది.

అయినా వరస పెట్టి నిర్ణయాలు వెలువడుతూనే ఉన్నాయి. భారత్ టిక్ టాక్ యాప్ పై నిషేధం విధించిన తర్వాత అగ్రరాజ్యం అమెరికా కూడా అదే బాట పట్టింది. పబ్జీపై నిషేధం విధించినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించడంతో.. భారత్‌లో ఈ గేమింగ్ యాప్‌ను అందుబాటులో లేకుండా గూగుల్ ప్లే స్టోర్ నుంచి, యాపిల్ ప్లే స్టోర్ నుంచి తొలగించారు. పబ్జీ యాప్‌ను మన దేశంలో దాదాపు 50 మిలియన్ల మందికి పైగా వినియోగిస్తున్నారు. దేశ రక్షణ, భద్రత, ప్రజల వ్యక్తిగత సమాచార భద్రత నిమిత్తం అప్లికేషన్లపై నిషేధం విధించినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.

Next Story
Share it