Telugu Gateway
Politics

గోవా సీఎంకు కరోనా పాజిటివ్

గోవా సీఎంకు కరోనా పాజిటివ్
X

దేశంలో మరో ముఖ్యమంత్రి కరోనా బారిన పడ్డారు. బుధవారం నాడు గోవా సీఎం ప్రమోద్ సావంత్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన హోమ్ ఐసోలేషన్ కు వెళ్ళారు. ఇప్పటివరకూ దేశంలో కరోనా బారిన నాల్గవ ముఖ్యమంత్రిగా సావంత్ నిలిచారు. సెప్టెంబర్ 1 నుంచే గోవాలో ప్రయాణికులపై ఉన్న ఆంక్షలు అన్నీ తొలగించారు. అంతే కాదు..పబ్బులు, బార్లకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కోవిడ్ పరీక్షలు అవసరం లేకుండానే ఎవరైనా రాష్ట్రంలోకి రావచ్చొని పేర్కొన్నారు. దేశంలో ఇప్పటికే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కర్ణాటక సీఎం యడ్యూరప్ప, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ లు కోవిడ్ బారిన పడ్డారు. గోవా సీఎం నాల్గవ వ్యక్తి. గోవాలో నమోదు అయిన మొత్తం కరోనా కేసులు 17418గా ఉన్నాయి.సీఎం ప్రమోద్ సావంత్ తో సమావేశం అయిన అధికారులు, ఇతరులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సీఎం తన నివాసం నుంచే విధులు నిర్వహిస్తారని, సీఎంవో కార్యకలాపాలు యదావిధిగా కొనసాగుతాయని ఒక ప్రకటనలో తెలిపారు.

Next Story
Share it