ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఫ్లైట్లపై దుబాయ్ నిషేధం
BY Telugu Gateway18 Sept 2020 2:43 PM IST

X
Telugu Gateway18 Sept 2020 2:43 PM IST
దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎయిర్ బబుల్ ఒప్పందంలో భాగంగా ఎయిర్ ఇండియా దుబాయ్ కు సర్వీసులు నడుపుతోంది.. అయితే వారంలో రెండుసార్లు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానాల్లో కరోనా పాజిటివ్ పేషంట్లు ప్రయాణించారని గుర్తించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిషేధం అక్టోబర్ 2 వరకూ కొనసాగనుంది. యూఏఈ నిబంధనల ప్రకారం దుబాయ్ కు వెళ్లే ప్రయాణికులు ఎవరైనా కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ కలిగి ఉంటేనే దేశంలోకి అనుమతిస్తారు. అది కూడా ప్రయాణానికి 96 గంటల ముందు ఆర్ టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకుని ఉండాలి. గతంలో ఇదే తరహాలో హాంకాంగ్ కూడా ఎయిర్ ఇండియా విమానాలపై నిషేధం విధించింది.
Next Story



