Telugu Gateway
Politics

ట్రంప్...కాసేపు నోర్మూసుకుంటావా!

ట్రంప్...కాసేపు నోర్మూసుకుంటావా!
X

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన తొలి చర్చే ఘాటు ఘాటుగా సాగింది. ప్రస్తుత అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్, డెమాక్రటిక్ నామినీ జో బైడెన్ ల మధ్య మాటల యుద్ధం సాగింది. బైడెన్ , ట్రంప్ లు ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. బైడెన్ మాట్లాడుతుండగా..ట్రంప్ పలుమార్లు అడ్డం పడటంతో ట్రంప్ కు ఘాటు హెచ్చరికలే చేశారు. చివరకు ట్రంప్ నుద్దేశించి కాసేపు నోర్మూసుకుంటావా అని వ్యాఖ్యానించారు. ఈ చర్చలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ చెబుతున్న కరోనా లెక్కలు నిజం కాదని అన్నారు. సరైన లెక్కలు చూపించటం లేదని ఆరోపించారు. ప్రపంచం కరోనా వైరస్ బారిన పడటానికి ప్రధాన కారణం చైనానే అని మరోసారి ఆరోపించారు. తొంభై నిమిషాలల పాటు ఈ చర్చ సాగింది. తాము అధికారంలోకి వస్తే తొలి ప్రాధాన్యత కరోనా నియంత్రణే అని జో బైడెన్ స్పష్టం చేశారు.

ట్రంప్ పన్నులు ఎగ్గొడుతున్నారని..టీచర్లు చెల్లించే పన్నుల కంటే ట్రంప్ చెల్లించిన పన్నులు చాలా తక్కువ అని వ్యాఖ్యానించారు. ఈ వార్తలను ఫేక్ అని చెబుతున్న డొనాల్డ్ ట్రంప్ నిజాలు ఏమిటో ప్రజలకు చూపించవచ్చు కదా? అని జో బైడెన్ ప్రశ్నించారు. ఇప్పటివరకూ అమెరికాకు ట్రంప్ వంటి చెత్త అధ్యక్షుడు ఎప్పుడూ రాలేదన్నారు. చర్చను పక్కదారి పట్టించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు బైడెన్ పలుమార్లు విమర్శించారు. ట్రంప్ కు బదులు తనను అమెరికా అధ్యక్షుడిగా ఎందుకు ఎన్నుకోవాలో జో బైడెన్ ప్రజలకు వివరించారు. ట్రంప్ అమెరికాను అనారోగ్యానికి గురిచేయటమే ఆర్ధికంగా నష్టాలకు కారణం అయ్యారని..విభజనలు సృష్టించి..హింసకు కారణం అయ్యారని విమర్శించారు. తాను ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో మాంద్యం రాగా ఆ సమస్యను సమర్ధవంతంగా ఎదుర్కొన్నట్లు తెలిపారు.

Next Story
Share it