Telugu Gateway
Cinema

డ్రగ్స్ కేసు...చిక్కుల్లో దీపికా పడుకొణె!

డ్రగ్స్ కేసు...చిక్కుల్లో దీపికా పడుకొణె!
X

బాలీవుడ్ డ్రగ్స్ ఎపిసోడ్ లో ప్రముఖ హీరోయిన్ దీపికా పడుకొణె చిక్కుల్లో పడినట్లే కన్పిస్తోంది.. ఎన్ సీబీ అధికారులు శనివారం నాడు ఆమెను ఐదున్నర గంటలపాటు విచారించారు. అయితే ఆమె చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా దాటవేసినట్లు ఎన్ సీబీ అధికారులు చెబుతున్నారు. బాలీవుడ్ లో డ్రగ్స్ వాడకంతోపాటు డ్రగ్స్ సరఫరా అంశంపై ప్రశ్నలు సంధించారు. ముఖ్యంగా పలువురు ప్రముఖ హీరోయిన్లు..ఇతర వ్యక్తులతో సాగిన వాట్సప్ చాట్ ల్లోని అంశాలపైనే ప్రశ్నలు సంధించారు. అయితే వేటికి ఆమె దగ్గర నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో మరోసారి ఆమెకు సమన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముందే శిక్షణ తీసుకున్నట్లు ఆమె ఎన్ సీబీ అధికారులకు సమాధానం ఇఛ్చినట్లు చెబుతున్నారు.

అయితే ఎన్ సీబీ విచారణతో తీవ్ర ఆందోళనకు గురైన ఈ భామ ఇంటికి చేరుకున్న తక్షణమే తన న్యాయ నిపుణులతో సమాశం అయినట్లు సమాచారం. మరోసారి విచారణకు పిలిస్తే అనుసరించాల్సిన వ్యూహాం..తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది. సుశాంత్ సింగ్ మృతి కేసులో జరుగుతున్న విచారణలో భాగంగా డ్రగ్స్ కేసును లోతుగా విచారిస్తున్న ఎన్సీబీ ఈ కేసులో ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్‌ను ప్రశ్నించింది. ఈ రోజు ఈ కేసు విచారణకు దీపిక పదుకొణె, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్ హాజరయ్యారు.

Next Story
Share it