Telugu Gateway
Andhra Pradesh

జనవరికి కరోనా వ్యాక్సిన్..జగన్

జనవరికి కరోనా వ్యాక్సిన్..జగన్
X

ఏపీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం శుభపరిణామం అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది జనవరి నాటికి కరోనాకు వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేట్‌ 12.0 నుంచి 8.3కి తగ్గిందని అన్నారు. టెస్టులు పెరిగాయని, కేసులు కూడా తగ్గుతున్నాయని సీఎం పేర్కొన్నారు. జగన్ మంగళవారం కరోనా నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. కరోనాతో సహజీవనం చేస్తూనే, అప్రమత్తంగా ఉండాలని సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారు. కరోనాను ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా ట్రీట్‌ చేస్తున్న రాష్ట్రం మనదేనని, కోవిడ్‌ హాస్పిటల్స్‌ లిస్ట్‌ గ్రామ సచివాలయాల్లో ఉండాలని జగన్ సూచించారు. ఎంప్యానల్‌ హస్పిటల్స్‌ లిస్ట్‌ కూడా అందుబాటులో ఉండాలన్నారు.

104కు ఎవరు ఫోన్‌ చేసినా కోవిడ్‌ ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన అన్ని వివరాలు అందాలని చెప్పారు. రిక్రూట్‌ చేసిన వారంతా కూడా కరెక్ట్‌ గా డ్యూటీకి వెళుతున్నారా లేదా తనిఖీ చేయాలని సీఎం పేర్కొన్నారు. ‘‘పీరియాడికల్లీ చెకప్‌ ఉండాలి. దాదాపు 30 వేల మందిని కొత్తగా తీసుకొస్తున్నాం. వీరందరినీ మానిటర్‌ చేయాలి. 37000 వేల బెడ్స్‌, 240 హాస్పిటల్స్‌ లో ఫుడ్‌, శానిటేషన్, ఇన్‌ఫ్రా, స్టాఫ్‌ వీటిపై మానిటరింగ్‌ పక్కాగా ఉండాలి. ప్రతీ రోజూ కలెక్టర్లు, జేసీలు మానిటర్‌ చేయాలి. ఈ నాలుగు కరెక్ట్‌ గా ఉంటే చికిత్స కరెక్ట్‌ గా అందుతుంది. కోవిడ్‌ బాధితులను త్వరగా గుర్తించడం వలనే మరణాల సంఖ్య తగ్గుతుందని తెలిపారు.

Next Story
Share it