ఎల్ఆర్ఎస్ మీద హైకోర్టులో మరో పిటీషన్
తెలంగాణ సర్కారు ప్రకటించిన భూ క్రమబద్దీకరణ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) పై హైకోర్టులో పిటీషన్ల మీద పిటీషన్లు దాఖలు అవుతున్నాయి. ఈ స్కీమ్ పై రాజకీయ పక్షాల నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రజలు అంతా కరోనా కష్టకాలంలో ఉన్న సమయంలో ఈ స్కీమ్ పెట్టడం సరికాదని..ప్రభుత్వం నిర్ణయించిన క్రమబద్దీకరణ రసుములు కూడా ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు సర్కారు ఎదుర్కొంటోంది. సోమవారం నాడు ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
ఇదే అంశం పై ఇప్పటి కే ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పిటీషన్ దాఖలు చేసింది. ఎల్ ఆర్ఎస్ ద్వారా పేద ,మధ్య తరగతి కుటుంబాల వారు ఇబ్బందులు పడతారని కోమటిరెడ్డి తన పిటీషన్ లో పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ ను వెంటనే రద్దు చేసే విదంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. హైకోర్టు.అన్ని పిటిషన్ లను కలిపి విచారించే అవకాశం ఉంది.