రాజ్యసభ సమావేశాలను బహిష్కరించిన కాంగ్రెస్
రాజ్యసభను వివాదాలు వీడటంలేదు. ఎనిమిది మంది సభ్యులపై సస్పెన్షన్ ఎత్తి వేయాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. ఇదే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది. సస్పెన్షన్ ఎత్తేసే వరకూ సమావేశాలకు కాంగ్రెస్ హాజరు కాకూడదని నిర్ణయం తీసుకుంది. సర్కారు తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ గులాం నబీ ఆజాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండ్ అయిన సభ్యులు సోమవారం నుంచి సభా ప్రాంగణంలోనే నిరసన తెలియజేస్తున్నారు. ఎనిమిది సభ్యులపై సస్పెన్సన్ ఎత్తేసే వరకూ సమావేశాలను బహిష్కరిస్తామని ఆజాద్ ప్రకటించారు.
ఈ పరిణామాలపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు స్పందించారు. సస్పెన్షన్ పై తాను కూడా సంతోషంగా లేనని..అయితే నిబంధనలు ఉల్లంఘించి ప్రవర్తించినందుకే వారిని సస్పెండ్ చేయాల్సి వచ్చిందని అన్నారు. సభలో ఎవరైనా సరే నిబంధనలు పాటించాల్సేందనని వ్యాఖ్యానించారు. తాము ఏ ఒక్క సభ్యుడికి వ్యతిరేకంగా వ్యవహరించలేదన్నారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్, టీఎంసీ, ఆప్ పార్టీల నేతలు కూడా రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు.