Telugu Gateway
Politics

టీ టీడీపీ అధ్యక్షుడు రమణను తప్పించండి

టీ టీడీపీ అధ్యక్షుడు రమణను తప్పించండి
X

తెలంగాణ తెలుగుదేశంలో తిరుగుబాటు. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న పార్టీలో మార్పులు తక్షణ అవసరం అంటూ కొంత మంది నేతలు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి లేఖ రాశారు. అధ్యక్షుడి మార్పు జరగకపోతే అసలు పార్టీ ఉనికే ప్రశ్నార్ధకం అయ్యే అవకాశం ఉందన్నారు. ఏడేళ్లుగా రమణ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారని..టీడీపీని తిరిగి గాడిలో పెట్టాలంటే చురుకైన నేతను పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని కోరారు.

రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ఏపీకి వెళ్లటంతో తెలంగాణలో పార్టీ ఉనికే ప్రశ్నార్ధంగా మారింది. గత ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పొత్తు రెండు పార్టీలకు తీరని నష్టం చేసింది. మరో మూడేళ్ళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఇప్పటికైనా పార్టీని గాడిన పెడితే తప్ప ప్రయోజనం ఉండదని నేతలు చెబుతున్నారు. మరి చంద్రబాబు నేతల కోరికను తీరుస్తారో లేదో వేచిచూడాల్సిందే.

Next Story
Share it