టీడీపీ పార్లమెంట్ ఇన్ ఛార్జ్ లను ప్రకటించిన చంద్రబాబు
గత ఎన్నికల్లో ఓటమి అనంతరం తెలుగుదేశం పార్టీలో కీలక నాయకులు చాలా మంది ఇఫ్పటికీ మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం కొద్ది మంది నేతలు మాత్రమే యాక్టివ్ గా ఉంటున్నారు. మరో వైపు అధికార వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుంటోంది. ఇప్పటికే నలుగురు టీడీపీకి దూరం జరిగారు. రాబోయే రోజుల్లో మరిన్ని జంపింగ్ లు ఉంటాయో తెలియని పరిస్థితి. కరోనా కారణంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు కూడా అమరావతిని వీడి హైదరాబాద్ కే పరిమితం అయ్యారు. చంద్రబాబు అంటే వయస్సు పరంగా అర్ధం చేసుకోవచ్చు కానీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఎందుకు హైదరాబాద్ లో ఉండాలనే విమర్శలు పార్టీ నేతల నుంచే విన్పిస్తున్నాయి.
కారణాలు ఏమైనా కానీ చంద్రబాబు, నారా లోకేష్ లు ఇద్దరూ హైదరాబాద్ కే పరిమితం అవటం..కరోనాతో బయట కార్యక్రమాలు చేసే అవకాశం కూడా లేకపోవటంతో నేతలు అందరూ స్తబ్దుగా ఉన్నారు. ఈ తరుణంలో చంద్రబాబు టీడీపీ నూతన కమిటీ ఏర్పాటుపై కసరత్తు పూర్తి చేశారు. గతంలో వైసీపీ వేసిన తరహాలోనే టీడీపీలో కూడా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇన్ ఛార్జిలను నియమించింది. దీంతోపాటు రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు కలపి ఓ సమన్వయకర్తను కూడా నియమించారు. పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ల వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీకాకుళం- కూన రవికుమార్
విజయనగరం- కిమిడి నాగార్జున
అరకు- సంధ్యారాణి
విశాఖపట్నం- పల్లా శ్రీనివాసరావు
కాకినాడ- జ్యోతుల నవీన్
అనకాపల్లి- బుద్దా నాగ జగదీశ్వరరావు
అమలాపురం- రెడ్డి అనంతకుమారి
రాజమండ్రి- కొత్తపల్లి జవహర్
నర్సాపురం- తోట సీతారామలక్ష్మి
ఏలూరు- గన్ని వీరాంజనేయులు
మచిలీపట్నం- కొనకళ్ల నారాయణరావు
విజయవాడ- నెట్టెం రఘురాం
గుంటూరు- శ్రవణ్‌కుమార్
నరసరావుపేట- జీవీ ఆంజనేయులు
బాపట్ల- ఏలూరి సాంబశివరావు
ఒంగోలు- నూకసాని బాలాజీ
నెల్లూరు- అబ్దుల్ అజీర్
తిరుపతి- నర్సింహయాదవ్
చిత్తూరు- పులవర్తి నాని
రాజంపేట- రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి
కడప- లింగారెడ్డి
అనంతపురం- కాల్వ శ్రీనివాసులు
హిందూపురం- బీకే పార్థసారధి
కర్నూలు- సోమిశెట్టి వెంకటేశ్వర్లు
నంద్యాల- గౌరు వెంకటరెడ్డి.
పార్లమెంట్ సమన్వయకర్తలుగా..
విజయనగరం- కొండపల్లి అప్పలనాయుడు(మచిలీపట్నం, గుంటూరు)
విశాఖ- బండారు సత్యనారాయణమూర్తి (కాకినాడ, అమలాపురం)
విశాఖ- గణబాబు(శ్రీకాకుళం, విజయనగరం)
తూ.గో- నిమ్మకాయల చినరాజప్ప(విశాఖపట్నం, అనకాపల్లి)
ప.గో- పితాని సత్యనారాయణ(నరసరావుపేట, బాపట్ల)
కృష్ణా- గద్దె రామ్మోహన్(రాజమండ్రి, నరసాపురం)
గుంటూరు- నక్కా ఆనందబాబు(అరకు)
గుంటూరు- ధూళిపాళ్ల నరేంద్ర(ఏలూరు, విజయవాడ)
ప్రకాశం- ఉగ్రనరసింహారెడ్డి (తిరుపతి, చిత్తూరు)
నెల్లూరు- సోమిరెడ్డి(కడప, రాజంపేట)
అనంతపురం- ప్రభాకర్‌చౌదరి(కర్నూలు, నంద్యాల)
కర్నూలు- బీటీ నాయుడు(అనంతపురం, హిందూపురం)
కర్నూలు- బీసీ జనార్థన్‌రెడ్డి(ఒంగోలు, నెల్లూరు)