నితిన్ గడ్కరీకి కరోనా
BY Telugu Gateway16 Sept 2020 9:57 PM IST

X
Telugu Gateway16 Sept 2020 9:57 PM IST
కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ కూడా గడ్కరీ కరోనా బారినపడ్డారు. మంగళవారం నాడు ఒకింత నీరసంగా ఉందని డాక్టర్ సంప్రదించగా..పరీక్షలు చేశారని..అందులో కోవిడ్ 19 పాజిటివ్ అని తేలిందని వెల్లడించారు. గడ్కరీ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. అందరి ఆశీస్సులతో ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని తెలిపారు. తాను ఐసోలేషన్ లోకి వెళ్లినట్లు తెలిపారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.
Next Story



