తెలంగాణను దివాళా తీయించిన కెసీఆర్ దేశాన్ని ఉద్దరిస్తారా?
BY Telugu Gateway8 Sept 2020 7:46 PM IST

X
Telugu Gateway8 Sept 2020 7:46 PM IST
అక్రమంగా సంపాదించుకున్న అక్రమాస్తులను క్రమబద్దీకరించుకునేందుకే తెలంగాణ సర్కారు ఎల్ఆర్ఎస్ పథకాన్ని తీసుకొచ్చిందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో రెవెన్యూ చట్టాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. బండి సంజయ్ మంగళవారం నాడు యాదాద్రి జిల్లాలో పర్యటించారు.
భువనగిరిలో మీడియాతో మాట్లాడుతూ సీఎం కెసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను దివాళా తీయించిన సీఎం కెసీఆర్ దేశాన్ని ఎలా ఉద్దరిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పల్లోకి నెట్టేశారని విమర్శించారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Next Story



