Telugu Gateway
Politics

ఈ తీర్పు చారిత్రాత్మకం

ఈ తీర్పు చారిత్రాత్మకం
X

సంచలనం సృష్టించిన బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నో సీబీఐ కోర్టు వెలువరించిన తీర్పుపై బిజెపి సీనియర్ నేతలు ఎల్ కె అద్వానీ, మురళీ మనోహర్ జోషిలు స్పందించారు. 28 సంవత్సరాలు విచారించిన తర్వాత సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పు సంచనాలత్మకంగా మారింది. చాలా రోజుల తర్వాత అద్భుతమైన వార్త అందింది. ఒక్కటి మాత్రమే చెప్పగలుగుతా. ‘‘జైశ్రీరాం. ఇచ్చిన తీర్పు చాలా ముఖ్యమైంది. మా అందరికీ సంతోషకరమైన క్షణం. ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. రామ జన్మభూమి ఉద్యమం పట్ల నా వ్యక్తిగత నిబద్ధత, పార్టీ నిబద్ధతను ఈ తీర్పు నిరూపిస్తుంది.’’ అంటూ అద్వానీ సంతోషం వ్యక్తం చేశారు.

‘‘ఈ తీర్పు చారిత్రాత్మక నిర్ణయం. డిసెంబర్ 6 న అయోధ్యలో జరిగిన సంఘటనలో ఎలాంటి కుట్ర జరగలేదని రుజువు చేస్తోంది. తాము చేపట్టిన ర్యాలీల్లో, కార్యక్రమాల్లో కుట్ర లేదు. మేము చాలా సంతోషంగా ఉన్నాం. అందరూ రామ మందిర నిర్మాణంపై ఆసక్తిగా ఉన్నాం.’’ అని మనోషర్ జోషి పేర్కొన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అద్వానీ, మురళీమనోహర్ జోషీతో పాటు మరో 32 మంది నిందితులు నిర్దోషులంటూ తీర్పు వెలువడిన విషయం తెలిసిందే.

Next Story
Share it