Telugu Gateway
Politics

జగన్ డిక్లరేషన్ కు పట్టుబట్టండి

జగన్ డిక్లరేషన్ కు పట్టుబట్టండి
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మంగళవారం నాడు చిత్తూరు జిల్లా నేతలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ కోసం పట్టుబట్టాలని పార్టీ నేతలను కోరారు. అన్యమతస్తులు డిక్లరేషన్ ఇచ్చాకే తిరుమలలో అడుగుపెట్టాలని అన్నారు.

బ్రహ్మోత్సవాల్లో ఒంటరిగా పట్టువస్త్రాలిస్తే రాష్ట్రానికే అరిష్టమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చాలని వైసీపీ ప్రయత్నిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. జగన్ డిక్లరేషన్ అంశంపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. గత కొన్ని రోజులుగా ఏపీలో డిక్లరేషన్ అంశం పెద్దవివాదంగా మారిన విషయం తెలిసిందే.

Next Story
Share it