Telugu Gateway
Politics

అక్టోబర్ 6న అపెక్స్ కమిటీ సమావేశం

అక్టోబర్ 6న అపెక్స్ కమిటీ సమావేశం
X

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల అంశంపై చర్చించేందుకు అపెక్స్ కమిటీ సమావేశం అక్టోబర్ 6 న జరగనుంది. ఇప్పటికే ఈ సమావేశం రకరకాల కారణాలతో రెండుసార్లు వాయిదా పడింది. అపెక్స్ కమిటీ సమావేశానికి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షత వహించనున్నారు.

ఈ భేటీలో తెలంగాణ సీఎం కెసీఆర్, ఏపీ సీఎం జగన్ లు పాల్గొననున్నారు. ఇరు రాష్ట్రాలు ఒకరి ప్రాజెక్టులపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ తరుణంలో అపెక్స్ కమిటీ సమావేశం ఈ వివాదాలకు ఎలాంటి పరిష్కారం చూపనుందనేది ఆసక్తికరంగా మారింది.

Next Story
Share it