అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ
BY Telugu Gateway10 Sept 2020 8:04 PM IST

X
Telugu Gateway10 Sept 2020 8:04 PM IST
అంతర్వేది దేవాలయంలో రథం దగ్దానికి సంబంధించి ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై సీబీఐ విచారణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖకు లేఖ రాయనున్నారు. శుక్రవారం నాడు దీనికి సంబంధించి సర్కారు ఉత్తర్వులు జారీ చేయనుంది. గత కొన్ని రోజులుగా రథం దగ్దం వ్యవహారం ఏపీలో రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. ఈ అంశంపై బిజెపితోపాటు హిందూ సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి.
రధం దగ్ధానికి కారణం అయిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. టీడీపీతోపాటు జనసేన కూడా సీబీఐ విచారణ కోరింది. బిజెపి, జనసేనలు శుక్రవారం నాడు చలో అంతర్వేది కార్యక్రమం తలపెట్టాయి. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించటం ద్వారా రాజకీయ విమర్శలకు సీఎం జగన్ చెక్ పెట్టినట్లు అయింది.
Next Story