Telugu Gateway
Politics

కేంద్ర మంత్రి షెకావత్ తో జగన్ భేటీ

కేంద్ర మంత్రి షెకావత్ తో జగన్ భేటీ
X

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉదయమే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో సమావేశం అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్ట్‌ కు నిధులు విడుదల చేయాలని షెకావత్‌కు జగన్ విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు తెలంగాణ, ఏపీల మధ్య నెలకొన్న జలవివాదాలపై షెకావత్ అధ్యక్షతన జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం కూడా వాయిదా పడింది. ఒకసారి తెలంగాణ సీఎం కెసీఆర్ తేదీ మార్చాలని కోరటం..మరోసారి కేంద్ర మంత్రి కరోనా రావటంతో అపెక్స్ సమావేశాలు రద్దు అయ్యాయి.

ఈ భేటీ సందర్భంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి కూడా చర్చించినట్లు సమాచారం. మంగళవారం సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం జగన్ మరోసారి బుధవారం నాడు సమావేశం కానున్నట్ల సమాచారం. ఈ భేటీ ముగిసిన తర్వాత జగన్ నేరుగా ఢిల్లీ నుంచి తిరుమల బయలుదేరి వెళ్లనున్నారు.

Next Story
Share it