నాగబాబు కు కరోనా
BY Telugu Gateway16 Sept 2020 2:07 PM IST

X
Telugu Gateway16 Sept 2020 2:07 PM IST
ప్రముఖ నటుడు నాగబాబు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. "ఇన్ఫెక్షన్ ఎల్లప్పుడూ మనల్ని బాధకు గురిచేయదు. దాన్ని ఇతరులకు సాయం చేసే అవకాశంగా మలుచుకోవాలి" అని అన్నారు నాగబాబు. తాను త్వరలోనే కోలుకుని ప్లాస్మా డోనర్‌గా మారుతానని ఆయన తెలిపారు. టాలీవుడ్లో ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు కోవిడ్ ప్రభావానికి గురైనవారే. రాజమౌళి, ఎం.ఎం.కీరవాణి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తదితరులు కోవిడ్ ప్రభావం బారిన పడ్డారు.
Next Story