ఈశ్వరయ్య రాజీనామా చేయాలి..లేదా జగన్ తప్పించాలి
BY Telugu Gateway13 Aug 2020 8:24 PM IST

X
Telugu Gateway13 Aug 2020 8:24 PM IST
ఏపీ ఉన్నత విద్య నియంత్రణా, పర్యవేక్షణా కమిటీ ఛైర్మన్ గా ఉన్న జస్టిస్ ఈశ్వరయ్య తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని టీడీపీ సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నాయకుడు అయిన యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. లేదంటే సీఎం జగన్ ఆయన్ను తక్షణం పదవి నుంచి తప్పించాలన్నారు. ఈ మేరకు యనమల గురువారం నాడు ఓ ప్రకటన విడుదల చేశారు.
‘జడ్జి రామకృష్ణ ఆయనపై చేసిన ఆరోపణలు తీవ్రమైనవి. ఫోన్ సంభాషణల ఆడియో తనదేనని ఈశ్వరయ్య ఒప్పుకున్నారు. ప్రలోభాలు, బెదిరింపులు జస్టిస్‌గా పనిచేసిన ఈశ్వరయ్యకు తగదు. హైకోర్టు న్యాయమూర్తుల ప్రతిష్టను దెబ్బతీసేలా పిటిషన్లు దాఖలు చేయించడం సరికాదు. ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టే, హైకోర్టు ఈశ్వరయ్యపై విచారణకు ఆదేశించింది. ’ అని యనమల పేర్కొన్నారు.
Next Story