Telugu Gateway
Andhra Pradesh

రాష్ట్ర చరిత్రలో ఇంత పనికిమాలిన ప్రభుత్వాన్ని చూడలేదు

రాష్ట్ర చరిత్రలో ఇంత పనికిమాలిన ప్రభుత్వాన్ని చూడలేదు
X

ఏపీ సర్కారుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఇంత పనికిమాలిన ప్రభుత్వాన్ని చరిత్రలో చూడలేదని వ్యాఖ్యానించారు. తన మూర్ఖత్వంతో, వితండ వాదనతో రాష్ట్రానికి సీఎం జగన్ తీవ్ర నష్టం చేస్తున్నారని ఆరోపించారు. ఇసుక, మద్యం, భూములు,గనులు, ప్రతిదానిలో వైసీపీ కుంభకోణాలే అని విమర్శించారు. కొండలు కొట్టేస్తున్నారు,అడవులు నరికేస్తున్నారు,మట్టి,ఇసుక మింగేస్తున్నారు. వైసిపి అవినీతి కుంభకోణాలకు హద్దు అదుపు లేకుండా పోయిందన్నారు. విజయవాడ పార్లమెంట్ సమీక్షలో భాగంగా కృష్ణా జిల్లా నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ‘ పరిపాలనలో అనుభవం లేదు, క్రైసిస్ మేనేజిమెంట్ తెలియదు. గవర్నెన్స్ చేతగాదు, అడ్మినిస్ట్రేషన్ గుండుసున్నా. తప్పుల మీద తప్పులు చేయడమే పనిగా పెట్టుకున్నారు.

అమరావతిలో 130సంస్థలను వెళ్ళగొట్టి 60వేల ఉద్యోగాలు పోగొట్టారు. ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ ఇన్ని అఘాయిత్యాలు జరగలేదు. ఇంత అప్రదిష్ట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో ఎప్పుడూ రాలేదు. టిడిపి హయాంలోనే కృష్ణా జిల్లాలో గణనీయమైన అభివృద్ది. కృష్ణా డెల్టా ఆధునీకరణకు రూ1200కోట్లు ఖర్చు చేశాం. రూ 1400కోట్లతో తెచ్చిన ఐకానిక్ బ్రిడ్జ్ ను వైసిపి వచ్చాక రద్దు చేశారు. పుంగనూరు దళిత యువకుడి ఉదంతం మరో ఉదాహరణ. నేను డిజిపికి లేఖ రాసినా ఓం ప్రతాప్ మృతదేహానికి పోస్ట్ మార్టమ్ చేయకుండా హడావుడిగా అంత్యక్రియలు జరిపారు. ఇప్పుడు మళ్లీ పోస్ట్ మార్టమ్ డ్రామాలు ఆడుతున్నారు.’ అని విమర్శించారు.

Next Story
Share it