ఉండవల్లికి కరోనా పాజిటివ్

X
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కరోనా బారిన పడ్డారు. రెండు రోజులుగా ఉండవల్లి జ్వరంతో బాధపడుతున్నారు. పరీక్షలు చేయించుకోగా..కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన వైద్యుల సలహాలను పాటిస్తూ రాజమండ్రిలో హోం ఐసోలేషన్లో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం మీడియాతో మాట్లాడిన ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా ప్రతినిధులను కరోనా గురించి అప్రమత్తం చేశారు. విధుల్లో భాగంగా బయట తిరుగుతారు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Next Story



