Telugu Gateway
Telangana

అపోలో..బసవతారకం ఆస్పత్రులపై హైకోర్టు ఆగ్రహం

అపోలో..బసవతారకం ఆస్పత్రులపై హైకోర్టు ఆగ్రహం
X

ప్రైవేట్ ఆస్పత్రుల తీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిది. ఇష్టానుసారం ఛార్జీలు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై నామమాత్రపు చర్యలు తీసుకోవటం సరికాదని పేర్కొంది. ముఖ్యంగా అపోలో, బసవతారకం ఆస్పత్రులు ప్రభుత్వ షరతులు ఉల్లంఘించాయన్న పిల్ పై హైకోర్టులో బుధవారం నాడు విచారణ జరిగింది. విశ్రాంత ఉద్యోగి ఓ ఎం దేబరా పిల్ పై హైకోర్టు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. కొంత మంది పేదలకు ఉచిత వైద్యం అందించాలన్న షరతులతో ప్రభుత్వం రాయితీ ధరతో ఆస్పత్రులకు భూమి కేటాయించిందన్న పిటిషనర్ అపోలో, బసవ తారకం ఆస్పత్రులు పేదలకు ఉచిత వైద్యం ఇవ్వడం లేదని కోర్టుకు తెలిపారు.

షరతులు ఉల్లంఘిస్తే భూములు ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అధిక బిల్లులు చెల్లించక పోతే మృతదేహం కూడా అప్పగించడం లేదని హైకోర్టు ప్రైవేట్ ఆస్పత్రులపై తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. లైసెన్సులు రద్దు చేస్తే సరిపోదని.. భూములు వెనక్కి తీసుకోవాలని వ్యాఖ్య. అపోలో, బసవ తారకం ఆస్పత్రులపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Next Story
Share it