Telugu Gateway
Telangana

తెలంగాణ కోసం పోరాడిన వారందరికీ ఇలా భూ కేటాయింపులు చేస్తారా?

తెలంగాణ కోసం పోరాడిన వారందరికీ ఇలా భూ కేటాయింపులు చేస్తారా?
X

తెలంగాణ హైకోర్టు గురువారం నాడు సర్కారు తీరుపై కీలక వ్యాఖ్యలు చేసింది. దర్శకుడు శంకర్ కు భూ కేటాయింపుల వ్యవహారంపై విచారణ సందర్భంగా ప్రభుత్వ తీరు ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపేలా ఉందని వ్యాఖ్యానించింది. 2.5 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని 25 లక్షల రూపాయలకు ఎలా కేటాయిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఏజీ స్పందిస్తూ తెలంగాణ ఉద్యమంలో శంకర్ కీలక పాత్ర పోషించారని కోర్టుకు తెలిపారు. తెలంగాణ కోసం త్యాగం చేసిన వేల మందికి ఇలాగే ఇస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది.

. హైదరాబాదులో ఇప్పటికే అద్భుతమైన రామోజీ ఫిలిం సిటీ ఉందని, ప్రభుత్వమే సొంతంగా సినిమా స్టూడియో నిర్మించవచ్చు కదా అని ప్రశ్నించింది. ప్రభుత్వ భూములను సినీ పరిశ్రమ ఇలా కేటాయించటానికి వీల్లేదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తప్పుడు సంకేతాలు ఇవ్వరాదని పేర్కొంది. కేబినెట్ నిర్ణయాలకు సహేతుకత ఉండాలని వ్యాఖ్యానించింది. ఈ అంశంపై కౌంటర్ దాఖలుకు రెండు వారాల గడువు కోరగా..హైకోర్టుకు ఇందుకు అంగీకరించింది.

Next Story
Share it