Telugu Gateway
Cinema

ఇలియానా ‘ది బిగ్ బుల్ ’ లుక్ విడుదల

ఇలియానా ‘ది బిగ్ బుల్ ’ లుక్ విడుదల
X

ఒకప్పుడు తెలుగులో ఓ వెలుగు వెలిగిన ఇలియానా వెండితెరపై మెరవక చాలా కాలమే అయింది. అడపాదడపా కన్పించినా ఆ సినిమాలు కూడా పెద్దగా ఏమీ ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ లో ‘ది బిగ్ బుల్ ’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ కు జోడీగా నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన హీరోయిన్‌ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను చిత్రం బృందం మంగళవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా హీరో అభిషేక్‌ బచ్చన్‌ మూవీ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు.

‘ఇది ‘ది బిగ్‌ బుల్‌’ సినిమాలోని ఇలియానా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌. భారత దేశ ఆర్థిక వ్యవస్థలోని నేరాలకు పాల్పడిన ఓ వ్యక్తికి సంబంధించిన కథాంశంతో తెరకెక్కుతున్న క్రైం డ్రామా చిత్రం. త్వరలో ఈ చిత్రం డిస్నీ హాట్ స్టార్‌లో విడుదల కానుంది’ అని క్యాప్షన్‌ జత చేశారు. ఇలియానా కూడా ‘ది బిగ్‌ బుల్‌’ సినిమా ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘ఈ సినిమాలో భాగం అయినందుకు చాలా సంతోషపడుతున్నాను’ అని పేర్కొన్నారు.

Next Story
Share it