Telugu Gateway
Telangana

కేంద్రం తీరు దారుణం..జీఎస్టీ పరిహారంపై పోరాటమే

కేంద్రం తీరు దారుణం..జీఎస్టీ పరిహారంపై పోరాటమే
X

చట్టబద్దంగా రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ పరిహారం కేంద్రం ఎగ్గొట్టాలని చూడటం దారుణమని తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఈ విషయంపై పార్లమెంట్ లో గట్టిగా పోరాటం చేస్తామని , అవసరమైతే న్యాయపోరాటానికి వెనకాడబోమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చట్టం ప్రకారం జీఎస్టీ పరిహారం 3 లక్షల కోట్లకు గాను లక్షా 65 వేల కోట్లకు తగ్గించడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. జీఎస్టీ చట్టప్రకారం 14 శాతం గ్రోత్ రెట్ ప్రకారం పూర్తి స్థాయిలో జీఎస్టీ పరిహారం చెల్లించాలని చట్టంలో పేర్కొందని తెలిపారు. యాక్ట్ ఆఫ్ గాడ్ పేరిట,కరోనా పేరిట లక్షా 35 వేల కోట్ల నష్టపరిహారాన్ని ఇవ్వకుండా ఎగ్గొట్టాలని చూస్తోందని..ఇది తెలంగాణకు ఏ మాత్రం సమ్మతం కాదని స్పష్టం చేశారు. హరీష్ రావు సోమవారం నాడు మీడియాతో మాట్లాడారు. చట్టంలో కోవిడ్ అని గాని, ప్రకృతి వైపరిత్యాలని గాని ఎలాంటి విభజనకు అవకాశం లేదని తెలిపారు. నైతికంగా చూసినా, న్యాయపరంగా చూసినా కేంద్రం జీఎస్టీ పూర్తి పరిహారం చెల్లించాల్సిందేనని పేర్కొన్నారు. జీఎస్టీ అమలులోకివచ్చి 3 ఏళ్లు అయింది. జీఎస్టీ డబ్బులు, ఐజీఎస్టీ డబ్బులు మిగిలితే కన్సాలిడేట్ ఫండ్ లో జమ చేసుకున్నారు.

తగ్గితే రాష్ట్రాల ను అప్పులు తీసుకోమని చెబుతున్నారు. కరోనా వల్ల అంచనా మేరకు 3 లక్ష కోట్ల పరిహారం రాష్ట్రాలకు ఇవ్వం. కేవలం లక్షా 65 వేల కోట్లు మాత్రమే ఇస్తామంటున్నారు. జీఎస్టీ పరిహారం 1లక్షా 35 వేల కోట్లను తగ్గించాలని కేంద్రం ఆలోచిస్తుంది. దీన్ని తెలంగాణ రాష్ట్రం ఏ మాత్రం అంగీకరించదు. కోవిడ్ కేంద్ర ప్రభుత్వానికే కాదు. రాష్ట్ర ప్రభుత్వాలకు తీవ్ర నష్టం జరిగింది. కోవిడ్ కారణంగా సెస్ తగ్గిస్తామనడం సరి కాదు. తెలంగాణ రాష్ట్రం నాలుగు నెలల్లో 34 శాతం అంటే 8వేల కోట్ల ఆదాయం కోల్పోయింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలి. రాష్ట్రాలకు నిధులు విరివిగా ఇవ్వడం ద్వారా ఆదుకోవాలి. రాష్ట్రాలకు హక్కుగా రావాల్సిన జీఎస్టీ సెస్ ను ఎగ్గొట్టాలని చూస్తోంది. జీఎస్టీలో చేరడం వల్ల తెలంగాణ నష్టపోతుందని ఆనాడు తర్జన భర్జన పడ్డాం. 2016-2017లో తెలంగాణ రాష్ట్రం 22 శాతం గ్రోత్ రెట్ తో ముందుకు పోతోంది. తెలంగాణ జీఎస్టీలో చేరకపోతే 25 వేల కోట్లు అదనంగా వచ్చేవి. జీఎస్టీలో చేరి సెస్ రూపంలో 18 వేల 32 కోట్ల రూపాయలు చెల్లించి కేవలం 3200 కోట్లు మాత్రమే. సెస్ రూపంలో ఎక్కువ చెల్లించి తక్కువ పొందాం.

జీఎస్టీ 7, 8 సమావేశాల్లో అరుణ్ జెట్టీ ఆర్థిక మంత్రిగా సెస్ తగ్గినా,కేంద్రమే బాధ్యత తీసుకుని రాష్ట్రాలకు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. జీఎస్టీ కొత్తగా వచ్చినప్పుడు అనేక రాష్ట్రాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. క్రూడ్ ఆయిల్ తగ్గిన టైంలో కేంద్రం పెట్రోల్ , డిజీల్ మీద లీటరుమీద 13 రూపాయలు పెంచింది దీనివల్ల లక్ష కోట్ల రూపాయలు వచ్చాయి.సర్ చార్జిలు, సెస్ రూపంలో కేంద్రానికి 16 శాతం ఆదాయం వస్తోంది. రాష్ట్రాలకు ఆదాయ పరిమితులు ఉన్నాయి. కేంద్రం అనుమతితోనే రాష్ట్రాలు ఏదైనా చేయాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాలకు రావాల్సిన సెస్ ను ఇవ్వాల్సిందే. కేంద్రం పూర్తి పరిహారం చెల్లించాల్సిదే .లేకపోతే పార్లమెంట్ లో గట్టిగా నిలదీస్తాం. ఢిల్లీ, చత్తీస్ ఘడ్, పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్, తెలంగాణ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశం అయ్యాం. వీరంతా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆప్షన్-1, ఆప్షన్ -2 కాదు. చట్టానికిలోబడి పూర్తి పరిహారం చెల్లించాల్సిందేనని చెప్పారు. సీఎం కేసీఆర్ నీతి అయోగ్, ఇతర మీటింగ్ లో స్పష్టంగా చెప్పారు .దేశంలోఏ ప్రాంతం అభివృద్ధి చెందినా దేశ అభివృద్ధిగా చూడాలని చెప్పారు. కాని ఇందుకు విరుద్దంగా సంకుచితంగా ఆలోచిస్తుంది. ఇది సరైన విధానం కాదన్నారు.

Next Story
Share it