Telugu Gateway
Telangana

శ్రీశైలం ప్రమాదంలో తొమ్మిది మంది మృతి

శ్రీశైలం ప్రమాదంలో తొమ్మిది మంది మృతి
X

విషాదం. శ్రీశైలంలోని విద్యుత్ ప్రాజెక్టులో జరిగిన ప్రమాదంలో అందులో చిక్కుకున్న తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో గురువారం రాత్రి 10.30 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. ప్యానెల్స్ లో ఒక్కసారిగా పెద్ద పెద్ద శబ్దాలతో మంటలు ఎగిసి పడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం పసిగట్టిన ఉద్యోగులు మంటలను ఆర్పడానికి ప్రయత్నాలు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 17 మంది ఉద్యోగులు ప్లాంటులో ఉన్నారు. వారిలో 8 మంది బయటకు రాగలిగారు. కానీ మిగిలిన 9 మంది అక్కడే చిక్కుకుని పోయారు.

ఈ తొమ్మిది మందిలో జెన్ కో కు చెందిన డిఇ శ్రీనివాస్ గౌడ్, ఎఇలు వెంకట్ రావు, మోహన్ కుమార్, ఉజ్మ ఫాతిమా, సుందర్, ప్లాంట్ అటెండెంట్ రాంబాబు, జూనియర్ అటెండెంట్ కిరణ్, హైదరాబాద్ అమరాన్ బ్యాటరీ కంపెనీకి చెందిన వినేష్ కుమార్, మహేష్ కుమార్ ఉన్నారు. ఎస్కేప్ టన్నెల్ ద్వారా బయటకు రావడానికి వారు ప్రయత్నం చేసినప్పటికీ, దట్టమైన పొగల వల్ల సాధ్యం కాలేదు. ప్లాంట్ లో చిక్కుకున్న 9 మంది దురదృష్టవశాత్తూ మరణించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు ఉద్యోగులు చికిత్స పొందుతున్నారు.

Next Story
Share it