కరోనా బారిన ఎస్పీ బాలసుబ్రమణ్యం
BY Telugu Gateway5 Aug 2020 2:05 PM IST

X
Telugu Gateway5 Aug 2020 2:05 PM IST
టాలీవుడ్ పెద్ద ఎత్తున కరోనా బారిన పడుతోంది. ఇప్పటికే దర్శకుడు రాజమౌళి కుటుంబం మొత్తం కరోనా బారిన పడగా..తాజాగా దర్శకుడు తేజ కూడా ఆ జాబితాలో చేరారు. బుధవారం నాడు గానగంధర్వుడు బాలసుబ్రమణ్యం కూడా కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని..ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వీడియో ద్వారా వెల్లడించారు.
గత రెండు రోజులుగా జ్వరం ,దగ్గుతో బాధపడుతున్నట్లు, వైద్య పరీక్షల అనంతరం కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందన్నారు. కరోనా వైరస్ తీవ్రత చాలా తక్కువగా ఉందని, తన అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందవద్దని కోరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, అందరి అశీస్సులతో తొందరలోనే కోలుకుంటానని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రముఖ నటుడు పృథ్వీ కూడా మంగళవారం నాడు తనకు కరోనా సోకిందని తెలిపారు.
Next Story