బాలసుబ్రమణ్యానికి కరోనా నెగిటివ్ వార్తలపై చరణ్ వివరణ
BY Telugu Gateway24 Aug 2020 5:51 AM GMT
X
Telugu Gateway24 Aug 2020 5:51 AM GMT
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇంకా ఐసీయూలోనే..ఎక్మో సాయంతో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగానే ఉందని ఆయన తనయుడు చరణ్ వివరణ ఇచ్చారు. సోమవారం ఉదయమే ఎస్సీ బాలుకు కరోనా నెగిటివ్ వచ్చినట్లు ఆయన పేరుతో ఓ ప్రకటన వెలువడింది. అయితేే ఆయన వీడియో ద్వారా ఓ సందేశం ఇస్తూ ఇప్పుడు కరోనా నెగిటివ్..పాజిటివ్ అన్నది కాకుండా తన తండ్రికి ఇంకా ఎక్మోతోనే వైద్యం అందిస్తున్నారని తెలిపారు.
రూమర్లను నమ్మవద్దని..డాక్టర్లతో మాట్లాడిన తర్వాత తానే వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. బాలసుబ్రమణ్యం ఆరోగ్యం విషయమించటంతో ఆయనకు లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ తో వైద్యం అందిస్తూ వచ్చారు. ఎస్సీ బాలుకు చికిత్స కోసం దేశ, విదేశాల్లో వైద్య నిపుణుల సేవలు అందిస్తున్నారు.
Next Story