Telugu Gateway
Politics

సీనియర్లపై సోనియా..రాహుల్ ఫైర్

సీనియర్లపై సోనియా..రాహుల్ ఫైర్
X

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో సోమవారం నాడు హాట్ హాట్ గా చర్చలు సాగాయి. సీనియర్ నేతలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతోపాటు రాహుల్ గాంధీ కూడా మండిపడ్డారు. ఈ సమయంలో లేఖ రాయటాన్ని ఇద్దరూ తీవ్రంగా తప్పుపట్టారు. ఓ వైపు సోనియా అనారోగ్యంతో బాధపడుతున్న తరుణంలో లేఖ రాయటం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలంటూ 23 మంది సీనియర్లు సోనియాకు రాసిన లేఖ పార్టీలో పెద్ద కలకలమే రేపింది. గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ సరైన దిశ, దశ లేకుండా వెళుతుందనే విమర్శలు ఉన్న విషయం తెలిసిందే. సీనియర్ నేతలు కొంత బిజెపి కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని రాహుల్ మండిపడ్డారు. బిజెపి నేతలతో కుమ్మక్కు లేఖ రాశారా అని రాహుల్ ప్రశ్నించారు.

ఈ లేఖ తన తల్లిని తీవ్రంగా బాధించిందని తెలిపారు. అసలు లేఖ బయటకు ఎలా వెళ్లిందని సీనియర్ నేత ఏ కె అంటోని ప్రశ్నించారు. అయితే రాహుల్ వ్యాఖ్యలపై గులాం నబీ ఆజాద్, కపిల్ సిబాల్ లు షాక్ గురయ్యారు. తమకు బిజెపితో సంబంధాలు ఉన్నాయని అంటారా?. 30 ఏళ్ళకుపైగా పార్టీ కోసం సర్వం ధారపోసి పనిచేశామంటూ కౌంటర్ ఇచ్చారు. సోనియాగాంధీ మాత్రం తాను పదవి నుంచి తప్పుకుంటానని..కొత్త వాళ్లను ఎన్నుకోవాలని సూచించారు. ఎప్పటి నుంచో సీనియర్ నేతలు..రాహుల్ మధ్య గ్యాప్ పెరిగింది. ఈ సీడబ్ల్యూసీ సమావేశంలో ఇది బహిర్గతం అయింది.

Next Story
Share it