Telugu Gateway
Andhra Pradesh

‘గుడ్డు’ కావాలంటే ఏపీలో బిజెపి రావాలి

‘గుడ్డు’ కావాలంటే ఏపీలో బిజెపి రావాలి
X

ఎస్సీకి హోం మంత్రి ఇచ్చారు..ఎస్సీలకు గుండుకొట్టిస్తున్నారు

ఇళ్ళ స్థలాల విషయంలో అవినీతి జరిగింది

ఏపీలో 2024లో బిజెపి, జనసేనల ప్రభుత్వం అధికారంలోకి రానుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. ఈ దిశగా పనిచేస్తామన్నారు. ఏపీ బిజెపి నూతన అధ్యక్షుడిగా వీర్రాజు మంగళవారం నాడు బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, ఏపీ పార్టీ ఇన్ ఛార్జి సునీల్ దియోధర్ తదితరలు పాల్గొన్నారు. సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టిన అనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పిల్లలకు ‘గుడ్డు’ , పౌష్టికాహరం పెట్టించలేకపోయాయని..తాము అధికారంలోకి వస్తే మాత్రం అందరికీ గుడ్డు, పౌష్టికాహరం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రంలోని మోడీ సర్కారు అభివృద్ధి కోసమే పనిచేస్తుందని....ఏపీలోనూ అభివృద్ధి కావాలంటే బిజెపి, జనసేనల ప్రభుత్వం రావాల్సి ఉందన్నారు.

తాము ఎవరో ముఖ్యమంత్రి కావటానికి అధికారం కోరుకోవటం లేదని..ఏపీ అభివృద్ధి కోసమే పనిచేస్తున్నామని తెలిపారు. తాము రెండు రూపాయల గుడ్డు కాదు..పిల్లలకు ఐదు రూపాయల గుడ్డు పెడతామని తెలిపారు.జగన్ సర్కారుపై కూడా సోము వీర్రాజు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో ఎస్సీకి హోం మంత్రి పదవి ఇఛ్చారని..ఎస్సీలకు మాత్రం గుండుకొట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం కానిస్టేబుల్ ను కూడా బదిలీ చేయలేని వ్యక్తి నేడు హోం మంత్రిగా ఉన్నారన్నారు. జగన్ సర్కారులో ఇళ్ళ స్థలాల విషయంలో అవినీతి జరిగిందన్నారు. ఏపీలో ఉన్నది కుటుంబ పార్టీలన్నారు. అభివృద్ధి కోసమే పనిచేసే బిజెపి కీలక భూమిక పోషించే సమయం వచ్చిందన్నారు. పేదలకు ఫలాలు అందించటమే బిజెపి లక్ష్యమన్నారు.

చంద్రబాబు హయాంలోనూ ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందని సోము వీర్రాజు విమర్శించారు. చిన్న చిన్నఅ శాలపై సీబీఐ దర్యాప్తు అంటున్నారని విమర్శించారు. అమరావతి లో రైతులకు ఇవ్వాల్సిన 64 వేల ప్లాట్స్ ని అభివృద్ధి తేవాలన్నారు. రాజధాని లో నిజమైన రైతులకు ప్రభుత్వం న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. లేకపోతే 2024 లో జనసేన - బీజేపీ ప్రభుత్వం అమరవతిని అభివృద్ధి చేస్తుందని తెలిపారు. బీజేపీ ని అధ్యక్షుడే నడపాలి.....కన్ ఫ్యూజన్ అవసరం లేదు.. ఈ మాటను అందరూ అర్దం చేసుకోవాలని వ్యాఖ్యానించారు.

Next Story
Share it