Telugu Gateway
Politics

రాహుల్ కు అండగా శివసేన...కాంగ్రెస్ సీనియర్లపై ఫైర్

రాహుల్ కు అండగా శివసేన...కాంగ్రెస్ సీనియర్లపై ఫైర్
X

కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభంపై శివసేన స్పందన ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ల ఉమ్మడి సర్కారు ఉన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసిన 23 మంది సీనియర్లపై సామ్నా సంపాదకీయంలో శివసేన తీవ్ర విమర్శలు చేసింది. సీనియర్ల లేఖ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అంతం చేయటానికి కుట్రగా అభివర్ణించింది. రాహుల్ గాంధీపై బిజెపి వరస పెట్టి విమర్శల దాడి చేసినప్పుడు ఈ సీనియర్లు అంతా ఎక్కడ ఉన్నారని ప్రశ్నించింది.

రాహుల్ కాంగ్రెస్ పగ్గాలు వదిలేసినప్పుడు బాధ్యతలు తీసుకునేందుకు ఈ సీనియర్లు ఎందుకు ముందుకు రాలేదని ప్రశ్నించింది. రాహుల్ గాంధీని ఈ వృద్ధ రక్షకులు అంతర్గతంగా దెబ్బతీశారని, ఇలాంటి కుట్ర బిజెపి కూడా చేయలేదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జిల్లా స్థాయి నాయకులు కాని వారంతా కూడా పార్టీ బిక్షతోనే ముఖ్యమంత్రులు..కేంద్ర మంత్రులు అయ్యారని వ్యాఖ్యానించింది. ఇదో రాజకీయ కరోనా వైరస్ అని పేర్కొంది.

Next Story
Share it