కరోనా నుంచి కోలుకున్న రాజమౌళి..ఫ్యామిలీ
BY Telugu Gateway12 Aug 2020 8:35 PM IST
X
Telugu Gateway12 Aug 2020 8:35 PM IST
ప్రముఖ దర్శకుడు రాజమౌళితోపాటు ఆయన కుటుంబ సభ్యులు అందరూ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. రెండు వారాల హోం క్వారంటైన్ పూర్తయిన తర్వాత పరీక్షలు చేయించుకోగా..నెగిటివ్ వచ్చిందని తెలిపారు.
తనకు..తన కుటుంబ సభ్యులకు ప్రస్తుతం ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవన్నారు. శరీరంలో ఏ మేరకు యాంటీ బాడీస్ డెవలప్ అయ్యాయనే విషయం తెలవటానికి మూడు వారాలు పడుతుందని..అప్పుడు ఫ్లాస్మా ఇవ్వటానికి ఆస్కారం ఉంటుందని డాక్టర్లు తెలిపారని వెల్లడించారు.
Next Story