Telugu Gateway
Politics

మంత్రి జగదీష్ రెడ్డి, సీఎండీపై కేసులు పెట్టాలి

మంత్రి జగదీష్ రెడ్డి, సీఎండీపై కేసులు పెట్టాలి
X

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ప్రమాదానికి మంత్రి జగదీష్ రెడ్డి, సీఎండీ ప్రభాకర్ రావులే బాధ్యత వహించాలన్నారు. వారిద్దరిపై ఐపీసీ 302 సెక్షన్ కింద కేసులు పెట్టి, అరెస్టు చేయాలన్నారు. రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీలు ఆదివారం నాడు శ్రీశైలం దుర్ఘటనలో మృతి చెందిన డీఈ శ్రీనివాస్ గౌడ్, ఏఈ ఫాతిమా కుటుంబాలను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ ప్రమాదం పొంచి ఉందని క్షేత్ర సిబ్బంది రెండు రోజుల క్రితమే లేఖ రాసినా స్పందించ లేదన్నారు.

‘ఇవి ప్రమాద మరణాలు కాదు. ప్రభుత్వ హత్యలు. మంత్రి జగదీష్ రెడ్డి, సీఎండీ ప్రభాకర్ రావుల ను పదవుల్లో కొనసాగిస్తే ఘటనకు కేసీఆర్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది . హైదరాబాద్ లోనే ఉన్న బాధిత కుటుంబాలను పరామర్శించని కేసీఆర్ కు అసలు మానవత్వం ఉందా?. కెసీఆర్ కంటే రోశయ్యే నయం . 80 ఏళ్ల వయస్సులో సీఎంగా శ్రీశైలం వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం, హైదరాబాద్ లో 500 గజాల స్థలం ఇవ్వాలి . ఈ ఘటన పై సీబీఐ విచారణ జరగాలి’ అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Next Story
Share it