Telugu Gateway
Politics

శ్రీశైలం ప్రమాదంపై రేవంత్ అనుమానాలు

శ్రీశైలం ప్రమాదంపై రేవంత్ అనుమానాలు
X

శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు ప్రమాదంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ జల దోపిడీకి తెలంగాణ సీఎం కేసీఆర్ సహకరించి, విద్యుత్ ప్రాజెక్టులను చంపేసే కుట్ర జరుగుతోందని తాము ముందే చెప్పామని. ఈ క్రమంలోనే శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరగడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. కుట్రను ప్రమాదం పేరుతో కప్పిపెట్టే ప్రయత్నం జరుగుతుందేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై నిజానిజాలు తేలాలంటే సీబీఐ విచారణ జరిపించాలని ఎంపీ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

అది ప్రమాదవశాత్తు జరిగిందా? లేదంటే కుట్ర ఉందా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శ్రీశైలం మొదటి యూనిట్‌లో ఓ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. పెద్ద పెద్ద పేలుడు శబ్దాలతో మంటలు ఎగిసిపడ్డాయి. పవర్ హౌస్ లోపల దట్టమైన పొగ అలుముకోవడంతో పలువురు టీఎస్ జెన్‌కో ఉద్యోగులు అక్కడే చిక్కుకుపోయారు.

Next Story
Share it