సచివాలయంపై పదకొండు గంటల సమీక్షా?
BY Telugu Gateway1 Aug 2020 11:10 AM IST

X
Telugu Gateway1 Aug 2020 11:10 AM IST
ముఖ్యమంత్రి కెసీఆర్ తీరును కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. సీఎం శుక్రవారం నాడు నూతన సచివాలయం అంశంపై ఏకంగా పదకొండు గంటల పాటు సమీక్ష నిర్వహించారు. దీనిపై ఆయన ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘కరోనా కల్లోలంతో ప్రజలు చస్తున్నా, కోర్టులు తిడుతున్నా,,నిపుణులు హెచ్చరిస్తున్నా సీఎంకు చీమకుట్టినట్లైనా లేదు. ఎవరి పిచ్చి వారికి ఆనందం అన్నట్లు కరోనా సమస్యను గాలికొదిలేసి సచివాలయంపై 11 గంటల సుదీర్ఘ సమీక్ష చేయటం సీఎం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట’ అని పేర్కొన్నారు.
Next Story



