రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా ‘అల్లు’
పవర్ స్టార్ సినిమాతో ఎన్నో వివాదాలకు కారణమైన రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా ప్రకటించారు. అది కూడా ‘అల్లు’ అనే టైటిల్ తో. దీనికి సంబంధించి ట్విట్టర్ లో పలు ఆసక్తికర ట్వీట్లు చేశారు. ‘తనకి మంచి జరగాలి అంటే ప్లాన్ అల్లు, మరొకడికి చెడు జరగాలి అంటే ప్లాన్ అల్లు అనే స్ట్రాటజీల తో ప్లాన్ ల ‘అల్లు’డు లో ఆరితేరిపోయి, పెద్ద స్టార్ అయిన తన బావ పక్కనే ఉంటూ తన మైలేజీ పడిపోకుండా ఉండటానికి తమ ఇంటి “అల్లు”డు అని కూడా మర్చిపోయి ఎప్పటికప్పుడు ప్లాన్లు అల్లుతూ వుంటాడు. అందరితో తనని "ఆహా" అనిపించుకోవటానికి తనకి కావాల్సిన వాళ్ళకే మంచి జరిగేలా చెప్పి ప్లాన్ ల మీద ప్లాన్ అల్లుకుపోతూ ఉండే ఒక పెద్ద అల్లికల మాస్టర్ కథే ఈ "అల్లు"’ అని పేర్కొన్నారు. ఇది ఫిక్షనల్ రియాల్టీ ఫిల్మ్ అని ప్రకటించారు. ‘అల్లు’ అనే టైటిల్ ఎందుకు పెట్టామంటే ఇందులోని మెయిల్ క్యారెక్టర్ రకరకాల ప్లాన్స్ అల్లుతూ ఉంటాడు అని తెలిపారు వర్మ.
అల్లు సినిమాలో తాను థియేటర్ మాఫియా, పార్టీ టిక్కెట్ల అమ్మకం, ఎంతో ప్రేమ ఉన్న సోదరుల మధ్య సమస్యలు సృష్టించటం వంటి అంశాల గురించి ఏమీ చెప్పటంలేదన్నారు. కొంత మంది అనుకుంటున్నట్లు నన్ను ‘నికృష్ణుడు’ అని తిట్టినందుకు ఈ సినిమా తీయటం లేదన్నారు. “అల్లు" will have characters called A Aaravind, K Chiraaanjeevi, Prawan Kalyan, A Aaarjun, A Sheeresh, K R Chraran, N Baebu and etc etc అని ట్వీట్ చేశారు వర్మ. మరి వర్మ ప్రకటించిన ఈ కొత్త సినిమా ఎంత దుమారం రేపుతుందో చూడాల్సిందే. చూస్తుంటే వర్మ ఇందులోకి చాలా మందిని లాగారు. పవర్ స్టార్ కు కౌంటర్ కు కొంత మంది వర్మపై ‘పరాన్నజీవి‘ అనే సినిమా కూడా తీసిన విషయం తెలిసిందే.