Telugu Gateway
Politics

పరీక్షల సంగతి వదిలేసి..బొమ్మలపై మాట్లాడతారా?

పరీక్షల సంగతి వదిలేసి..బొమ్మలపై మాట్లాడతారా?
X

ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. మన్ కీ బాత్ లో జేఈఈ-నీట్‌ పరీక్షల నిర్వహణపై మోదీ చర్చిస్తారని విధ్యార్ధులు భావిస్తే ప్రధానమంత్రి మాత్రం బొమ్మలపై చర్చ చేశారని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. భారత్‌ను టాయ్‌ హబ్‌గా మలచాలని ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాహుల్‌ ఈ విమర్శలు చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో సెప్టెంబర్‌లో జేఈఈ, నీట్‌ పరీక్షలను కేంద్రం నిర్వహించడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. జేఈఈ (మెయిన్‌) పరీక్షలు సెప్టెంబర్‌ 1 నుంచి 6 మధ్య జరగనుండగా, నీట్‌ పరీక్ష సెప్టెంబర్‌ 13న జరగనుంది.

Next Story
Share it