థర్టీ ఇయర్స్ పృథ్వీకి తీవ్ర అనారోగ్యం
BY Telugu Gateway4 Aug 2020 4:54 PM GMT
X
Telugu Gateway4 Aug 2020 4:54 PM GMT
ప్రముఖ నటుడు థర్టీ ఇయర్స్ పృద్విరాజ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయన ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు. ఆయన ఈ విషయమై సెల్పీ వీడియోను పోస్టు చేశారు.శ్వాస తీసుకోవడానికి , మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు. వీడియో చూస్తే ఆయన ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు కన్పిస్తోంది.
పది రోజుల నుంచి తీవ్రమైన జలుబు, అనారోగ్యంతో బాధపడుతున్నానని ఆయన తెలిపారు. తాజాగా వచ్చిన పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. అందరి ఆశీస్సులు, వెంకటేశ్వరస్వామి ఆశీర్వాదాలు తనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ,త్వరగా కోలుకుంటానని ఆశిస్తున్నానని ఆయన తెలిపారు.
Next Story