హైదరాబాద్ లో దాక్కుని తప్పుడు ఆరోపణలు
BY Telugu Gateway18 Aug 2020 11:13 AM

X
Telugu Gateway18 Aug 2020 11:13 AM
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ లో కూర్చుని ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఆరోపణలు చేయటం ఆయనకు అలవాటేనన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరపమని చంద్రబాబు అడగడం సిగ్గుచేటన్నారు. దివంగత నేత వైఎస్సార్‌పై కూడా ఇలానే ఆరోపణలు చేశారన్నారు. ఆనాడు ఫోన్ ట్యాపింగ్‌ను నిరూపించలేకపోయారు.
ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పెద్దిరెడ్డి విమర్శించారు. ‘‘చంద్రబాబు ఓటుకు నోటు కేసులో దొరికినప్పుడు కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేదు. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి ఎందుకు విచారణ చేయమనలేదు. కేసీఆర్‌కు భయపడి చంద్రబాబు హైదరాబాద్ నుండి పారిపోయారు. రాత్రికి రాత్రి విజయవాడ వచ్చేసి రాష్ట్రానికి ద్రోహం చేశారన్నారు.
Next Story