Telugu Gateway
Politics

పోలవరం పూర్తయి ఉంటే..!

పోలవరం పూర్తయి ఉంటే..!
X

గోదావరి వరద ముంపు ప్రాంత ప్రజల బాధలు ఆవేదన కలిగిస్తున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్ట సకాలంలో పూర్తి అయి ఉంటే ఇంతటి వరద పరిస్థితులు ఉండేవి కావని అన్నారు. పసి పిల్లలకు పాలు కూడా అందటం లేదన్నారు. బాధితులకు మెరుగైన పునరావాసం..వైద్యం అందించాలని పవన్ కళ్యాణ్ కోరారు. గోదావరి వరద కారణంగా దాదాపు 200 గ్రామాలు, లంకలు నీటమునిగి వేల మంది నిరాశ్రయులవ్వటం చాలా బాధాకరమన్నారు. జనసేన బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి..అక్కడి పరిస్థితులను పరిశీలించారని పునరావాస కేంద్రాల్లో సరైన వసతులు లేవని వారు చెప్పారన్నారు.

వైద్య సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేరని...కొంత మంది అధికారులు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. వరదల కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, వరద ఉధృతి కారణంగా సుమారు పది వేల ఎకరాల మేర వరి పంట, 14 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలు నీట మునిగాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పంటలు నష్టపోయిన రైతులను సత్వరమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story
Share it