Telugu Gateway
Cinema

సెప్టెంబర్ 5న నాని ‘వి’ విడుదల

సెప్టెంబర్ 5న నాని ‘వి’ విడుదల
X

ప్రచారమే నిజం అయింది. నాని 25వ సినిమా ‘వి’ సెప్టెంబర్ 5న విడుదల కానుంది. అది కూడా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ సినిమాలో నాని, సుధీర్ బాబులు, నివేదా థామస్, అదితి రావు హైదరీ లు నటిస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి వి సినిమా థియేటర్లలోనే విడుదల చేయటం కోసం చిత్ర యూనిట్ చాలా రోజులు వేచిచూసింది. కానీ కరోనా కారణంగా థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.

దీంతో నిర్మాత దిల్ రాజు చివరకు ఓటీటీ వైపు మొగ్గుచూపక తప్పలేదు. ఈ సినిమాలో నాని నెగిటివ్ రోల్ పోషిస్తున్నాడు. సినిమాను ఓటీటీలో విడుదల చేస్తూ నాని ఓ ప్రకటన చేశారు. గత 12 సంవత్సరాలు నా సినిమాల కోసం థియేటర్లకు వచ్చారు..ఈ సారి మీకు థ్యాంక్స్ చెప్పటానికి ఇంటికే వస్తున్నాను..ఒకింత ఉత్సాహంగా..మరికొంత అతృతతోనూ ఉన్నట్లు తెలిపారు. థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత టక్ జగదీష్ సినిమా ఉంటుందని పేర్కొన్నారు.

https://www.youtube.com/watch?v=0xplVpc5wls

Next Story
Share it