Telugu Gateway
Cinema

‘వైల్డ్ డాగ్’ నాగార్జున ఫస్ట్ లుక్

‘వైల్డ్ డాగ్’ నాగార్జున ఫస్ట్ లుక్
X

సీనియర్ హీరో నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ‘వైల్డ్ డాగ్’ మూవీకి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఇప్పటి వరకు 12 మిషన్స్ చేసినట్టు ఉంది. ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా నాగ్‌ లుక్‌ ఆకట్టుకుంటోంది. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రలో నాగార్జున డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు అహిసార్ సాల్మన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తైన ఈ చిత్రంలో నాగార్జునకు జోడిగా దియా మీర్జా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. నాగార్జున శుక్రవారంతో 60 ఏళ్లు పూర్తి చేసుకొని 61 వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్భంగా నాగార్జునకి అభిమానులు, సెలబ్రిటీలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Next Story
Share it