Telugu Gateway
Politics

స్థానికంగా బొమ్మలు తయారు చేయాలి

స్థానికంగా బొమ్మలు తయారు చేయాలి
X

ప్రపంచ వ్యాప్తంగా ఏడు లక్షల కోట్ల రూపాయల విలువ చేసే బొమ్మల మార్కెట్ లో భారత్ వాటా ప్రస్తుతం చాలా తక్కువగా ఉందని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. స్థానికంగా బొమ్మల తయారీపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో స్టార్టప్ లు బొమ్మల తయారీ కోసం జట్టుగా ఏర్పడాలని సూచించారు. ‘మన్ కీ బాత్’లో భాగంగా మాట్లాడుతూ మోడీ ఈ సూచన చేశారు. సెప్టెంబర్ నెలను పోషకాహర నెలగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా పోషకాహారంపై క్విజ్ లు పెట్టనున్నట్లు వెల్లడించారు.

పాఠశాలల్లో రిపోర్టు కార్డుల తరహాలో పోషకాహార కార్డులు కూడా ప్రవేశపెట్టనున్నట్లు మోడీ తెలిపారు. దేశ ప్రజలందరూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని, అందరూ స్వదేశీ యాప్‌లనే వాడాలన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా రైతులు కష్టపడి పంటలు పండిస్తున్నారని కొనియాడారు. ప్రతి వేడుకను పర్యావరణహితంగా జరుపుకోవాలని చెప్పారు.

Next Story
Share it