Telugu Gateway
Telangana

భూములు ఉపయోగించని పరిశ్రమలపై కొరడా

భూములు ఉపయోగించని పరిశ్రమలపై కొరడా
X

తెలంగాణ సర్కారు భూములు తీసుకుని పరిశ్రమలు ఏర్పాటు చేయని సంస్థలపై కొరడా ఝుళిపించేందుకు రెడీ అయింది. భూములను తీసుకొని నిరుపయోగంగా ఉంచిన వారిపై చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ అధికారును ఆదేశించారు. కెటీఆర్ మంగళవారం నాడు పరిశ్రమల శాఖకు సంబంధించిన పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి వాటిని ప్రారంభమయ్యేలా చూసి ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంతో పెట్టుబడులు తేస్తున్నామని, అయితే కంపెనీలు సైతం ఇచ్చిన హామీ మేరకు కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం కోరుకుంటుందన్నారు. ఈ మేరకు నిర్ణీత గడువు లోపల కార్యకలాపాలు ప్రారంభించని వారందరికీ షో కాజ్ నోటీసులు జారీ చేయాలని సూచించారు. దీంతోపాటు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ పేరుతో మార్పిడి చేసుకున్న కార్యకలాపాలకు సంబంధించి కూడా సమీక్షించిన మంత్రి, ఇలా కార్యకలాపాలు ప్రారంభం కానీ కంపెనీలకు కూడా నోటీసులు జారీ చేయాలన్నారు.

రాష్ట్రంలో ఉన్న అన్ని పరిశ్రమలతో కూడిన సమగ్ర సమాచారాన్ని ఒకే చోట చేర్చాలని ఇందుకోసం ఒక బ్లూ బుక్ ని తయారు చేయాలని సూచించారు. ఫార్మా సిటీని కాలుష్య రహితంగా అభివృద్ధ చేయనున్నట్లు వెల్లడించారు. ఫార్మా సిటీలో ఫార్మా యూనిట్లు అత్యదిక శాతం జీరో లిక్విడ్ డిశ్చార్జ్ యూనిట్లు ఉంటాయన్న కెటిఆర్, ఫార్మా సిటి వ్యర్ధ్యాలను కేంద్రీకృతంగా శుద్దీ జరిగేలా ఎర్పాట్లు ఉంటాయన్నారు. తద్వారా వ్యర్ధాల శుద్ది విషయంలో అత్యుత్తమ ప్రమాణాలతోపాటు, కంపెనీల విచక్షణ లేకుండా పటిష్టంగా జరుగుతుందన్నారు. ఇలా ఫార్మాసిటీ కాలుష్యం భయం లేకుండా ఉంటుందన్నారు.

Next Story
Share it